ఇట్స్ ఆర్డర్ : ఆధార్ లేదని పెన్షన్ ఆపొద్దు

ADHARఆధార్ అనుసంధానం పూర్తికానంత మాత్రాన వృద్ధులకు పెన్షన్‌ చెల్లింపులో జాప్యం జరగకూడదని మంగళవారం(ఏప్రిల్-10) కేంద్ర సమాచార కమిషన్‌ తేల్చి చెప్పింది. గత మార్చి నుంచి తనకు ఎందుకు పెన్షన్‌ చెల్లించడం లేదో తెలపాలంటూ అహ్మద్‌నగర్‌ కు చెందిన నిర్మలా నిషికాంత్‌ దుమానే కేంద్ర సమాచార కమిషన్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. అనంతరం దీనిపై మరోసారి దాఖలు చేసిన పిటిషన్‌ లో ఆధార్‌ కార్డును కచ్చితంగా అనుసంధానం చేయాలన్న ఉత్తర్వులను పంపాల్సిందిగా ఆమె డిమాండ్‌ చేశారు. ఈ పిటిషన్లను పరిశీలించిన కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు.. ఆధార్‌ కార్డు లింక్‌ చేయలేదన్న కారణంతో వృద్ధులు, రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌ చెల్లింపులో ఏ ప్రభుత్వ సంస్థ కూడా జాప్యం చేయడానికి వీల్లేదని తెలిపారు.  ఆధార్‌ కార్డు లింక్ చేయలేదన్న కారణంతో పెన్షన్‌ చెల్లింపును నిలిపివేయకూడదని, ప్రత్నామ్నాయ గుర్తింపు పత్రాల ఆధారంగా పెన్షన్ చెల్లింపులు జరపాలంటూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) బ్యాంకులు, పోస్టాఫీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Posted in Uncategorized

Latest Updates