ఇట్స్ ఎలక్షన్ టైమ్ : వాట్సాప్ లో ఫొటో పెట్టు.. క్యాష్ పట్టు

హైదరాబాద్ : ఎలక్షన్స్ దగ్గరపడుతుండటంతో రాజకీయ నాయకులు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే పలు కార్యక్రమాలు, సభలు నిర్వహిస్తుండగా..GHMC మాత్రం..వినూత్న కార్యక్రమం చేపట్టింది. వాట్సాప్ లో ఫోటో పెడితే.. రూ.25వేలు గెలుచుకునే అవకాశాన్న కల్పించింది GHMC. ముందస్తు ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఇప్పటికే ప్రచార రథాలు, నగరంలోని 92 ప్రాంతాల్లో అవగాహన కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు.. చైతన్య కార్యక్రమాల్లో ప్రజలను మరింత భాగస్వాములను చేసేందుకు నగదు బహుమతి ఇస్తామంటున్నారు. ఫొటో కొట్టు-బహుమతి పట్టు.. అంటు పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. GHMC కమిషనర్‌, జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్‌ ఆదేశాల మేరకు ఈ పోటీలు జరుపనున్నారు. 18 ఏళ్లు నిండి ..ఓటరు కార్డు కలిగిన వారు ఎన్నికల ప్రాధాన్యతకు సంబంధించి మంచి ఫొటోతో (క్యాప్షన్‌)ను రాసి 79931 53333 నంబర్‌ కు వాట్సప్‌ చేయాలి. మెస్సేజ్‌ చేసిన వారు తమ ఓటరు ఐడీ కార్డును జతచేసి పంపించాలి.

అక్టోబర్-16 నుంచి నవంబర్‌ 16 వరకు వాట్సప్‌ ద్వారా పంపిన ఫొటోల్లో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి విజేతలను ప్రకటిస్తారు. మొదటి బహుమతిగా రూ.25వేలు. రెండో బహుమతి రూ.20 వేలు. తృతీయ బహుమతి రూ.15 వేలు ఇవ్వనున్నారు. పోటీల్లో పాల్గొనే వారు హైదరాబాద్‌ జిల్లాకు చెందిన వారై ఉండాలని, ఇక్కడి ఓటరు గుర్తింపు కార్డు ఉండాలని తెలిపారు GHMC అధికారులు.

Posted in Uncategorized

Latest Updates