ఇట్స్ క్లియర్ : నీట్ ద్వారానే ఆయుష్ సీట్ల భర్తీ

aayush-1-1512379355దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల సీట్లనే నీట్‌ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తున్నారు. అయితే ఇక నుంచి వైద్య విద్య డిగ్రీ కోర్సుల సీట్లు కూడా జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ఆధారంగానే భర్తీ కానున్నాయి. ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, న్యాచురోపతి–యోగిక్, పబ్లిక్‌ హెల్త్‌ డిగ్రీ కోర్సుల సీట్లను కూడా నీట్‌ ర్యాంకుల ప్రాతిపదికన మాత్రమే భర్తీ చేయాలని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలు చేయాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.

తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్యను పర్యవేక్షించే కాళోజీ ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయానికి ఈ మేరకు లేఖ రాసింది. రాష్ట్రంలో ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, న్యాచురోపతి–యోగిక్, పబ్లిక్‌ హెల్త్‌ కోర్సులను నిర్వహించే కాలేజీలు 10 ఉన్నాయి. వీటిలో మొత్తం 695 సీట్లు ఉన్నాయి. నాచురోపతి–యోగిక్‌ కోర్సును అందించే కాలేజీ తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకటే ఉంది. వైద్య విద్యకు సంబంధించి అన్ని కోర్సులకు ఈసారి ఉమ్మడిగా కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నిర్ణయంతో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సులతోపాటు ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, న్యాచురోపతి–యోగిక్, పబ్లిక్‌ హెల్త్‌ కోర్సుల్లో చేరాలనుకునేవారు కచ్చితంగా నీట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. మే 6న నీట్‌ జరగనుంది.

Posted in Uncategorized

Latest Updates