ఇడియట్ అన్నందుకు ఓ వ్యక్తిపై కేసు పెట్టిన కాబోయే భార్య

గల్ఫ్ దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అక్కడ చిన్న చిన్న తప్పులకే భారీ శిక్షలు,జరిమానాలు విధిస్తారు. తనకు కాబోయే భార్యను సరదాగా ‘ఇడియట్’ అన్నందుకు ఓ వ్యక్తి పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ ఘటన అబుదాబిలో జరిగింది. ఆ వ్యక్తి వాట్సాప్ లో ఆమెకు సరదాగా ఇడియట్ అని మెసేజ్ చేశాడు. దీనిని అవమానంగా భావించిన ఆమె.. ఆ వ్యక్తి పై కేసు పెట్టింది. కేసును విచారించిన కోర్టు అతడికి రెండు నెలల జైలు శిక్షతో పాటు 20వేల దిర్హామ్స్(మన కరెన్సీలో సుమారు 3.92 లక్షలు) ఫైన్ కట్టాలని ఆదేశించింది.  సోషల్ మీడియాలో ఎవరినైనా తిడుతూ అభ్యంతరకరమైన మెసేజ్ లు పంపించడాన్ని అక్కడ సైబర్ క్రైమ్ గా పరిగణిస్తారు.

Posted in Uncategorized

Latest Updates