ఇది ఆట కాదమ్మా : నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన మహిళా క్రికెటర్

harmanpreet kaurభారత మహిళా క్రికెటర్‌, టీ20 కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌కౌర్‌కు డీఎస్పీ ఉద్యోగం దూరం కానుంది. ఈ ఏడాది  మార్చి 1వ తేదీన హర్మన్ ప్రీత్ పంజాబ్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆమె ఆ ఉద్యోగం కోల్పోయే అవకాశం కన్పిస్తోంది. దీనికి కారణం.. ఉద్యోగం చేపట్టే సమయంలో ఆమె సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవని తేల‌డ‌మే.

మీరట్‌లోని చౌదరీ చరణ్‌ సింగ్ వ‌ర్సిటీ నుంచి ఆమె డిగ్రీ పూర్తి చేసినట్లుగా తెలిపింది. కానీ ప్రభుత్వ అధికారులు ఆమె సర్టిఫికెట్ల పరిశీలిస్తే ఆ వ‌ర్సిటీలో ఆమె డిగ్రీ పూర్తి చేసినట్లు ఎక్కడా తేలలేదు. దీంతో వారు తమ నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఈ విషయం పై స్పందించిన హర్మన్ ప్రీత్.. ఇదంతా అంతా అబద్ధమని.. ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ.. సంబంధిత డిపార్ట్‌మెంట్‌ అధికారులతో మాట్లాడిన తర్వాత  మాట్లాడతానని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates