ఇది ఎలుకల పనేనా: ATM మిషన్ లో చిత్తైన నోట్లు

money-atmనగదు కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే…మరో వైపు అధికారుల నిర్లక్ష్యం మరింత ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. కొన్ని ఏరియాల్లో డబ్బుల్లేని ఏటీఎం మిషన్లతో జనం  నానా ఇక్కట్లు పడుతున్నారు. ఇక్కడ మాత్రం   ఆ ATM లో డ్రా చేస్తే చినిగిపోయిన నోట్లు వస్తున్నాయని… దీనికి కారణం నోట్లను ఎలుకలు కొట్టేయటమే అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. జూన్ 14న ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయగా చినిగిన నోట్లు వచ్చాయట… అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఆ ఏటీఎంలో ఉంచిన లక్షలాది రూపాయలను ఎలుకలు కొట్టిపారేశాయంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని బెంగళూరు పోలీసులు ఖండిస్తున్నారు.ఎలుకలు కొట్టేసిట్టు కన్పిస్తున్న డబ్బును ఫొటోషాప్ టెక్నాలజీతో ఎడిట్ చేసి పెట్టి ఉంటారంటున్నారు కొందరు నిపుణులు.ATM కేంద్రంలో ఉన్న మిషన్ లోకి ఎలుకలు వెల్లే అవకాశం ఉండదని…పొరపాటున అవి వెళ్లినా నగదు పెట్టెలోకి వెళ్లగానే అలారం మోగటం..విద్యుత్ షాక్ కొట్టడం జరుగుతుందన్నారు. ఏటీఎంలో చినిగిన నోట్లు వస్తున్నాయంటూ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని…నగర పోలీసు కమిషనర్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates