ఇది జపాన్ తుస్సు రాకెట్ : ఇలా లేచి.. అలా పడిపోయింది

missile failఅంతరిక్షంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవాలని ప్రయత్నించిన జపాన్ దేశానికి ఘోర అవమానం ఎదురైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా.. పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో తయారు చేసిన MOMO-2 రాకెట్ ప్రయోగం విఫలం అయ్యింది. ఫెయిల్ అవ్వటం అనేది ప్రయోగాల్లో భాగమే అయినా.. కనీసం 30 అడుగుల ఎత్తు కూడా ఎగరకుండానే.. లాంచ్ పాడ్ దగ్గరే కుప్పకూలిపోవటం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది.

జపాల్ భూభాగాన్ని అణువణువూనూ గుర్తించే విధంగా శాటిలైట్ ను తయారు చేసింది. ఈ శాటిలైట్ ను దక్షిణ హొకిడోలొలోని తైకీ రాకెట్ పరిశోధన కేంద్రం నుంచి ప్రయోగించాలని నిర్ణయించారు. 48 గంటల కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. జూన్ 30వ తేదీ ఉదయం 5.30గంటలకు రాకెట్ ను ప్రయోగించారు. అయితే కేవలం 30 అడుగుల ఎత్తు మాత్రం ఎగిరి.. కుప్పకూలిపోయింది. ఆ తర్వాత రాకెట్ పేలిపోయింది. కేవలం ఆరు సెకన్లలోనే సంబంధాలు తెగిపోయాయి. వాస్తవంగా అయితే భూమికి 100 కిలోమీటర్ల ఎత్తులో ఈ శాటిలైట్ ను ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే భూమికి 30 అడుగుల ఎత్తులోనే తుస్సు అనటం జపాన్ ప్రభుత్వాన్నే కాకుండా.. శాస్త్రవేత్తలను కూడా షాక్ కు గురి చేసింది. ఈ రాకెట్ ప్రయోగాన్ని లైవ్ ఇచ్చింది జపాన్ ప్రభుత్వ ఛానల్. ప్లస్ వన్, ప్లస్ 2 అని చదువుతుండగానే.. ప్లస్ ఆరు అన్న వెంటనే కిందకి పడిపోవటం స్పష్టంగా కనిపించింది.

Posted in Uncategorized

Latest Updates