ఇది డిఫరెంట్… ఫ్రంట్ కే పీఠం అంటున్న లగడపాటి

పోలింగ్ కు ముందు సర్వేతో హల్చల్ చేసిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్… రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలు బయటపెట్టారు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు తెల్సుకోవడానికి తాను, తన టీమ్ చాలా కష్టపడినట్టు చెప్పారు. ఇప్పటివరకు ఏ సర్వే ఫలితాలపైనా తాము ఇంత కష్టపడలేదని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలు, పరిస్థితులు వేగంగా, ఆసక్తికరాం మలుపులు తిరుగుతూ.. మారిపోయాయన్నారు. ఎవరు గెలుస్తారో కచ్చితంగా అంచనా వేయడానికి చాలా కసరత్తు చేయాల్సి వచ్చిందన్నారు. 3 నెలలుగా ముందస్తు ఎన్నికలు చాలా హోరాహోరీగా జరిగాయన్నారు. ఈ ఫలితాలకోసం దేశం అంతా ఎదురు చూస్తోందన్నారు. గత పోలింగ్ పర్సెంటేజీపైనే తన సర్వే వివరాలు ఆధారపడి ఉన్నాయని చెప్పారు. పోలింగ్ తగ్గితో ఓ రకంగా.. పెరిగితే మరో రకంగా ఫలితాలు ఉండేదని వివరించారు.

మొదట టీఆర్ఎస్ కు అనుకూల పవనాలున్నప్పటికీ…  ఆ తర్వాత పీపుల్స్ ఫ్రంట్ వైపు జనం మొగ్గుచూపినట్టుగా కనిపించిందన్నారు. ఐతే.. పోలింగ్ సమయం దగ్గరపడుతున్నకొద్దీ… పథకాలు, డబ్బు, ప్రేమ, జాలి, ఆశ, రాజకీయాలు, కసి ఇలా… అన్నీ ప్రభావితం చూపించాయన్నారు. అందుకే.. సర్వే ఫలితాల్లో కొంత అస్పష్టత కనిపిస్తోందని చెప్పారు లగడపాటి రాజగోపాల్.

ప్రజాకూటమిదే అధికారం : లగడపాటి రాజగోపాల్

లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వే ప్రకారం ప్రజా కూటమికి కండిషనల్ గా 65 స్థానాలు రావొచ్చు. ఇందులో పది స్థానాలు తగ్గవచ్చు.. లేదా పది స్థానాలు పెరగవచ్చని లగడపాటి చెప్పారు. టీఆర్ఎస్ కు 35 స్థానాలు రావొచ్చని చెప్పారు. ఇందులోనూ పది స్థానాలు పెరగొచ్చని.. తగ్గినా తగ్గొచ్చని అన్నారు. బీజేపీకి స్థానాలు పెరుగుతాయని.. ఏడు సీట్లలో కమలం గెలుస్తుందని అంచనా వేశారు. మజ్లిస్ పార్టీ ఆరు నుంచి ఏడు స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. సీపీఎం ఒక స్థానంలో గెలుస్తుందన్నారు. ఇతరులు అటూ ఇటుగా ఏడు స్థానాల్లో గెలుస్తారని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. పీపుల్స్ ఫ్రంట్ లో భాగంగా… పోటీ చేసిన 13 సీట్లలో టీడీపీ 7 సెగ్మెంట్లలో గెలుస్తుందని చెప్పారు. సీపీఐ, జనసమతి పార్టీలు ఒకటీ, రెండు సీట్లలో విజయం సాధించొచ్చని అన్నారు. ఖమ్మంలో బీఎల్ఎఫ్ గెలుస్తుందని.. ఇబ్రహీంపట్నం, మక్తల్ లో ఇండిపెండెంట్ లు గెలుస్తారని అంచనా వేశారు.

తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోలాగానే.. తెలంగాణలోనూ డబ్బు ప్రభావం పెరిగిందని చెప్పారు లగడపాటి రాజగోపాల్. గతంలో జాతీయ ఛానళ్లు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక ఎలక్షన్ విషయంలో తప్పు చెప్పాయని తన క్రెడిబిలిటీ ఏంటో డిసెంబర్ 11 తర్వాత తెలుస్తుందని చెప్పారు.పోస్ట్ పోల్ కూడా రెండు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్ బస్తీల్లో పనిచేసే వాళ్ళు అంతా.. గ్రామాలకు వెళ్లారు కాబట్టే.. హైదరాబాద్ లో ఓట్ పర్సెంటేజీ తగ్గిందన్నారు.

తనకు వ్యక్తిగతంగా ఎవరి మీదా కోపం లేదన్న లగడపాటి .. తనకు పార్టీలకు అతీతంగా నేతలు అందరూ సమానమే అన్నారు. జిల్లాల్లో 80శాతం కూటమికే అనుకూల పరిస్థితి ఉందన్నారు. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి అరెస్ట్ లు ఎన్నికలపై ప్రభావం చూపాయన్నారు. జాతీయ మీడియా సంస్థల్లో.. axis ,today చాణిక్య సంస్థల అంచనాలను తాను నమ్ముతానని చెప్పారు లగడపాట రాజగోపాల్.

Posted in Uncategorized

Latest Updates