ఇది నిజం.. చెక్ చేసుకోండి : పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి

petrol
ఏంటో హెడ్డింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారా.. అవునండీ ఇది నిజం. వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ ఉన్నాయి. కేవలం వారం రోజుల్లోనే లీటర్ పెట్రోల్ పై రూ.1.50 (రూపాయిన్నర), లీటర్ డీజిల్ పై రూ.1.33 (రూపాయి 33పైసలు) తగ్గింది. ఈ ధర ఆయా ప్రాంతాలను బట్టి 20పైసలు తేడా ఉంటుంది. ఇటీవల కాలంలో వారం రోజుల్లో ఇంతలా తగ్గటం ఇదే. మొన్నటి వరకు చుక్కలు చూపించిన ఇంధన ధరలు తగ్గుతున్నాయ్ అన్న సంగతే జనం గుర్తించలేకపోతున్నారు. 100, 200, 500 రూపాయల లెక్కన కొట్టించుకుని వెళ్లిపోతున్నారు. లీటర్ల లెక్కన పెట్రోల్, డీజిల్ పోయించుకోకపోవటంతో ధరల్లో తేడాను గుర్తించలేకపోతున్నారు వాహనదారులు. ప్రస్తుతం హైదరాబాద్ లో పెట్రోల్ రూ.75.95, డీజిల్ రూ.67.69గా ఉంది.

రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు కూడా ఎంతెంత ధర ఉందో తెలుసుకోలేకపోతున్నారు వాహనదారులు. ఇదే అదునుగా కొన్ని బంకుల్లో మోసాలు కూడా జరుగుతున్నాయి. వారం రోజుల్లో లీటర్ పెట్రోల్ రూపాయిన్నర తగ్గింది. డీజిల్ రూపాయి 33పైసలు దిగి వచ్చింది. రాబోయే నెల రోజుల్లో మరో 2 నుంచి 3 రూపాయల వరకు ధర తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాల క్రమంలో పెరిగినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతానికి అయితే రోజువారీగా ధరలు తగ్గుతున్నాయి. చెక్ ఇట్.. గమనించండి…

Posted in Uncategorized

Latest Updates