ఇది నిజం.. దానికి విషం : చీమ కుట్టి మహిళ మృతి

chemaచీమ కుడితే మనుషులు చనిపోతారని మనం ఇప్పటి వరకూ ఎక్కడా విని ఉండం. అంత చిన్న చీమ కుడితే చనిపోతారాని మనం కలలో కూడా ఊహించం. ఎప్పుడూ మన చుట్టూ తిరిగే చీమలు ఎంత ప్రమాదకరమైనవో కూడా మనం ఊహించం. చీమలు మనల్ని కుట్టినా పెద్దగా పట్టించుకోం. అయితే ఓ చీమ కాటుకు ఓ మహిళ చనిపోయిందన్న విషయం ఇప్పుడు అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తుంది.

కేరళ రాష్ట్రంలోని అడూర్ సిటీకి చెందిన సూసీ జెఫీ(36) సౌదీ రాజధాని రియాద్ లో కుటుంబంతో కలసి నివసిస్తుంది. మార్చి 19న తన ఇంట్లో నడుస్తున్న సమయంలో ఓ చీమ సూఫీని కుట్టింది. మొదట లైట్ తీసుకుంది సూఫీ. అందరిలాగే చీమ కుడితే ఏమవుతుందిలే అనుకుంది. ఆ తర్వాత తీవ్రమైన నొప్పి రావడంతో హాస్పిటల్ కు వెళ్లింది. ఆమెను కుట్టిన చీమ ద్వారా ఆమె శరీరంలోకి విషం వచ్చిందని డాక్టర్లు తెలిపారు. రెండువారాలుగా ICUలో ట్రీట్ పొందుతున్న ఆమె.. ఏప్రిల్ 3వ తేదీ మంగళవారం చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కొన్ని కీటకాలు చాలా ప్రమాదకరమైనవని.. వాటిని లైట్ తీసుకోవద్దని డాక్టర్లు చెబుతున్నారు.

చీమే కదా అని లైట్ తీసుకున్న సూఫీ మరణం ఇప్పుడు అందర్నీషాక్ కు గురి చేసింది. చీమల్లో కూడా విషం ఉంటుందా అని చర్చ మొదలైంది. అలాంటి చీమలు ఎక్కడ ఉంటాయ్.. ఏయే ప్రాంతాల్లో జీవిస్తాయి అనే చర్చ కూడా మొదలైంది. ఈ ఘటన సౌదీ రాజధాని రియాద్ లో జరిగింది.

Posted in Uncategorized

Latest Updates