ఇది నిజం : భక్తుడిగా మారిపోయి ఆలయాల్లో పూజలు చేసిన వర్మ

రామ్‌ గోపాల్‌ వర్మ ఒక్కసారిగా భక్తుడిగా మారిపోయారు. హేతువాద దృక్పథంతో తనదైన విలక్షణతను చాటుకునే వర్మ దైవదర్శనం చేసుకొని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. కొంతమంది బంధువులతో కలిసి ఆయన చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది వర్మకు పూలమాలలు వేసి ఆహ్వానం పలకగా.. వర్మ పూజలు చేశారు. వేదపండితులు మంత్రోచ్ఛరణలతో వేదపండితులు వర్మ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఆలయ నిర్వాహకులు వినాయకుడి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. అనంతరం సాధారణ భక్తుల తరహాలోనే ఆలయంలో కలియతిరుగుతూ దైవదర్శనం చేసుకున్నారు రామ్ గోపాల్ వర్మ.  ఆ తర్వాత వర్మ తిరుమల దర్శనానికి వెళ్లారు.

నాస్తికుడినైన నేను నా జీవితంలో మొట్టమొదటి సారిగా రేపు పొద్దున్న 6 గంటలకి తిరుపతి లో బాలాజీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని సాయంత్రం 4 గంటలకి తిరుపతి శిల్పారామం లో ప్రెస్ మీట్ పెట్టి లక్ష్మి ’స్ ఎన్టీఆర్ వివరాలు చెప్పబోతున్నాను అంటూ గురువారం వర్మ ట్వీట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates