ఇది నిజమే : “పోర్న్ స్టార్” తో ట్రంప్ ఎఫైర్

Donald-Trump-Stormy-Daniels (1)ట్రంప్ నెత్తిన మరో బాంబ్ పడింది. ట్రంప్ కు ఓ పోర్న్ స్టార్ తో లైంగిక సంబంధం ఉందంటూ ట్రంప్‌ వ్యక్తిగత న్యాయసలహాదారు మైకేల్‌ కోహెన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ విషయం బయటకు రాకుండా ఉండేందుకు 1 లక్షా 30 వేల డాలర్లను చెల్లించి ఆ నటితో ట్రంప్‌ ఒప్పందం కూడా చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే  వైట్‌ హౌజ్‌ ఈ వార్తలను ఖండించగా, అది నిజమేనంటూ ట్రంప్‌ వ్యక్తిగత న్యాయసలహాదారు మైకెల్ కోహెన్ ఇప్పుడు ట్రంప్ నెత్తిన ఓ బాంబు పేల్చారు. బుధవారం(ఫిబ్రవరి14) న్యూయార్క్‌ టైమ్స్‌ ఇంటర్వ్యూలో మైకెల్ మాట్లాడుతూ… పోర్న్‌స్టార్‌ స్టోర్మీ డేనియల్స్ తో ట్రంప్‌ 1 లక్షా 30 వేల డాలర్లతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమేనని తెలిపారు. ట్రంప్‌ చేసుకున్న ఒప్పందం ప్రలోభానికి గురి చేసేందుకు ఉద్దేశించింది కాదని, రాజకీయ విమర్శలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా చేసుకుందని, పైగా ఇది న్యాయబద్ధమైందని కోహెన్‌ తెలిపారు. ఇంతకాలం రహస్యంగా ఉన్న ఈ విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కాబట్టి, ఆమె నిరభ్యరంతరంగా ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించవచ్చు అని కోహెన్‌ తెలిపారు. అయితే ఇన్‌ టచ్‌ అనే మాగ్జైన్‌ లో అడల్ట్‌ స్టార్ స్టోర్మీ డేనియల్స్‌(అసలు పేరు స్టెఫానీ క్లిఫార్డ్‌) ఇంటర్వ్యూను ప్రచురించగా, వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ దానిని యథాతథంగా ప్రచురించింది. మెలానియా ట్రంప్ బిడ్డను ప్రసవించడానికి నాలుగు నెలల ముందే ట్రంప్‌తో తాను ఎఫైర్‌ పెట్టుకున్నట్టు  అందులో తెలిపింది. కొంతకాలమే కొనసాగిన తమ బం‍ధం సరదాగా సాగిపోయిందని తెలిపింది. అయితే వైట్‌హౌజ్‌ మాత్రం ఆ ఇంటర్వ్యూను ‘ఫేక్‌‌’ అంటూ కొట్టి పడేసింది.  అయితే ఇప్పుడు మైకేల్‌ వ్యాఖ్యలపై స్పందించేందుకు మాత్రం వైట్ హౌజ్ నిరాకరించింది.
Michael-Cohen-Trump-Lawyer

Posted in Uncategorized

Latest Updates