ఇది పక్కా నిజం : BMW కారులో పెట్టి.. తండ్రికి అంత్యక్రియలు

BMW carఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేస్తారు.. అలా చేసే సమయంలో వారికి ఇష్టమైన వాటిని అక్కడ ఉంచుతారు.. ఆయనతోపాటు పంపిస్తారు.. మామూలుగా అయితే బట్టలు, వాచీలు, బంగారం, చీరలు ఇలా ఉంటాయి.. అదే ఆయనకు BMW కారు ఇష్టం అయితే.. దాన్ని కూడా పూడ్చిపెడతారా.. ఈ మాట వింటేనే వింతగాను.. అమ్మో అనే సమాధానం వస్తుంది. నైజీరియాలో మాత్రం ఇలాగే జరిగింది. ఇది పక్కా నిజం. పూర్తి వివరాల్లోకి వెళితే..

నైజీరియా దేశంలో అజుబుకి అనే వ్యాపారవేత్త ఉన్నాడు. ఎంబోసి ప్రాంతంలో నివాసం. వందల కోట్ల ఆస్తి ఉంది. అతనికి ఓ తండ్రి ఉన్నాడు. అతనికి ఖరీదైన BMW కారులో తిరగాలనే ఆశ ఉంది. ఎంత డబ్బు ఉన్నా.. నాలుగు బీఎండబ్ల్యూ కార్లు కొనుగోలు చేసే సత్తా, డబ్బు ఉన్నా సాధ్యం కాలేదు. కొడుకు కూడా తండ్రి కోరికను తీర్చలేకపోయాడు. కొనిద్దాంలే అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే అజుబుకి తండ్రి హఠాత్తుగా చనిపోయాడు. అయ్యో అని బాధనపడ్డాడు. ఇన్ని కోట్లు ఉన్నా తండ్రి చిన్న కోరికను తీర్చలేకపోయానే అనే బాధ పడ్డాడు.

అప్పటికప్పుడు వెంటనే రూ.60లక్షల విలువైన BMW కారు కొనుగోలు చేశాడు. అందులో తండ్రి శవాన్ని ఉంచాడు. కారుతో సహా తండ్రిని పూడ్చిపెట్టాడు. మామూలుగా అయితే శవపేటికలో పెట్టి చేస్తారు.. ఇక్కడ మాత్రం BMW కారులోని సీట్లో కూర్చోబెట్టి అలాగే అంత్యక్రియలు నిర్వహించాడు కుమారుడు అజుబు. తన తండ్రి ఎంతో మంచి వాడని.. ఆయన ఈ కారులోనే స్వర్గానికి వెళతాడని అందరికీ చెబుతున్నాడు. అంతేనా భూమి నుంచి స్వర్గానికి వెళ్లే సమయంలో దారి తప్పకుండా కారులో GPS కూడా ఆన్ చేసి పెట్టాడంట.. ఇప్పుడు ఈ ఫొటోలు తెగ తిరిగేస్తున్నాయి. ఎవరి ఆనందం.. ఎవరి నమ్మకాలు వాళ్లవి.. ఎవరి..

Posted in Uncategorized

Latest Updates