ఇది పచ్చినిజం : డబ్బులు కట్టి గాసిప్ వార్తలు రాసుకోండి

pin

సోషల్ మీడియాలో మీరు కనీవినీ ఎరుగని.. కలలో కూడా ఊహించని సంచలన నిర్ణయం జరిగిపోయింది. ఇక నుంచి మీరు గాసిప్స్ వార్తలు రాయాలి.. చేతి జిల తీర్చుకోవాలి అనుకునే వారికి బంపరాఫర్ ప్రకటించింది ప్రభుత్వం. గాసిప్ వార్తలకు హాయిగా రాసుకోండి అంటూనే.. డబ్బులు కట్టాలని కండీషన్ పెట్టింది. నమ్మలేని ఈ నిజం ఎక్కడో తెలుసా ఉగాండ దేశంలో.. పూర్తి వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియా ముసుగులో జరుగుతున్న అసత్య ప్రచారాలకు చెక్ పెట్టేందుకు ఉగాండ దేశ ప్రభుత్వం రెడీ అయింది. సోషల్ మీడియాలో గాసిప్స్ వార్తలు ప్రచారం చేసుకోవడం, షేర్ చేసుకోవాలంటే ట్యాక్స్ చెల్లించాలంటోంది. ఉగండా పార్లమెంట్ శుక్రవారం (జూన్-1) ప్రజలు ఉపయోగిస్తున్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలపై వివాదాస్పద టాక్స్ విధించింది. ఇంటర్నెట్ మెసెంజింగ్ ఫ్లాట్ ఫాంలైన ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, వైబర్, స్కైప్ లపై రోజుకి 200 షిల్లాంగ్స్ (భారత కరెన్సీలో రూ.3.55) టాక్స్ విధించింది. జులై-1 నుంచి ఈ ట్యాక్స్ అమలులోకి రానుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకంపై పలు దేశాలు టాక్స్ లను విధించాయి. గత నెలలో పపువా న్యూగినియా కూడా తమ దేశంలో ఫేస్ బుక్ ని నిషేదించింది.

ఉగండా ప్రెసిడెంట్ యొవరీ మ్యూసెవనీ ఈ ఏడాది మార్చిలో ఆర్ధికశాఖ మంత్రి కి ఓ లేఖ రాశారు. సోషల్ మీడియాలో యూజర్లపై టాక్స్ విధించాలని, దీంతో గాసిప్ వార్తల కారణంగా ఏర్పడుతున్న హానికారకమైన ప్రభావం నుంచి దేశాన్ని ముందుకు తీసుకుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని రాశారు. అయితే ఎడ్యుకేషన్, రీజెర్చ్, రిఫరెన్స్ అవసరాల కోసం ఇంటర్నెట్ ఉపయోగించే వారిని ఈ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆ లేఖలో కోరాడు. అందులో భాగంగా ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చింది ఉగాండా ప్రభుత్వం. ఇక నుంచి గాసిప్ వార్తలతోపాటు పర్సనల్ విషయాలు ఏవైనా సరే షేర్ చేసుకోవాలంటే రోజుకు మూడున్నర రూపాయలు చెల్లించాలి. అప్పుడు ఆ వార్త ఇతరులకు చేరుతుంది. లేకపోతే నీ దగ్గరే ఉండిపోతుంది. దీనిద్వారా అయినా సోషల్ మీడియా బాధ తప్పుతుందని కొందరు అంటుంటే.. ఇప్పుడు ఇంకా టార్గెట్ చేసి మరీ వాడేసుకుంటారు అని మరికొందరు అంటున్నారు. ఎవరు వాదన ఎలా ఉన్నా..

Posted in Uncategorized

Latest Updates