ఇది పరువుకి సంబంధించింది : స్కూల్ అడ్మిషన్ తీసుకుంటే.. గోల్డ్ కాయిన్, రూ.5వేల క్యాష్

saఒకప్పుడు చిన్నపిల్లలు రెగ్యూలర్ గా స్కూల్ కి రావడానికి టీచర్లు, చాకెట్లు, బిస్కెట్లు వంటివి ఆఫర్ చేసేవాళ్లు. ఆ ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు స్కూల్ కి వస్తే బంగారం ఇస్తాం, డబ్బులు ఇస్తాం అని టీచర్లు పిల్లలకు ఆఫర్ చేస్తున్నారు.
తమిళనాడు రాష్ట్రం కొనర్ పాలయంలోని ప్రైమరీ స్కూల్.. 1996లో 165 మంది విద్యార్ధులతో స్టార్ట్ అయింది. నెమ్మదిగా ఆ గ్రామంలోని రైతులు పంటల నష్టం కారణంగా పక్క ప్రాంతాలకు వెళ్లిపోవడం ప్రారంభించారు. ఇంగ్లీషు మీడియం మోజుతో చాలా మంది తమ పిల్లలను పక్క ప్రాంతాల్లోని స్కూళ్లకి పంపిస్తున్నారు. దీంతో దశాబ్ధకాలంగా కొనర్ పాలయం స్కూల్ కి వచ్చే విద్యార్ధుల సంఖ్య ఐదు కన్నా తక్కువగా ఉంది. దీంతో ఆ స్కూల్ లో అడ్మీషన్లను పెంచేందుకు.. టీచర్లు ఫస్ట్ అడ్మిషన్ తీసుకునే 10 మంది పిల్లలకు ఒక్కొక్కరికి ఒక గోల్డ్ కాయిన్, 5 వేల రూపాయలను ఆఫర్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ స్కూల్ పేరు మార్మోగిపోయింది.

ఆఫర్ ప్రకటించిన తర్వాత.. ఇప్పటివరకూ ముగ్గురు పిల్లలు స్కూల్ లో జాయిన్ అయినట్లు స్కూల్ హెడ్ మాస్టర్ రాజేష్ చంద్రకుమార్ తెలిపారు. హెడ్ మాస్టర్ గా స్కూల్ కి వచ్చిన తర్వాత ఏడేళ్ల క్రితం ఆరుగురు విద్యార్ధులను మాత్రమే స్కూల్ కి తీసుకురాగలిగానని.. గ్రామంలో కూడా కుటుంబాల సంఖ్య 65 కు తగ్గిపోయిందని తెలిపారు. 10 మంది పిల్లలకన్నా తక్కువ ఉన్న స్కూల్స్ మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వం ఇటీవల ఓ నిర్ణయం తీసుకుంది. దీంతో హెడ్ మాస్టర్ రాజేష్ రిక్వస్ట్ తో.. అదే గ్రామానికి చెందిన బిజినెస్ మాన్ ఓ ఆలోచన చేశారు. గ్రామంలో స్కూల్ ఎట్టిపరిస్ధితుల్లో మూసివేయకూడదన్న ఉద్దేశంతో స్కూల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు..  మొదటి 10 మంది పిల్లలకు గోల్డ్ కాయిన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. అదేవిధంగా విలేజ్ హెడ్ సెల్వరాజ్.. ఒక్కొక్కరికి 5 వేల రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. గ్రామస్ధులు ఎడ్యూకేషనల్ డిపార్ట్ మెంట్ అధికారులకు ఈ ఐడియా చెప్పడంతో వాళ్లు కూడా దీనిని ఆమోదించారు. ఎట్టిపరిస్ధితుల్లో గ్రామంలో స్కూల్ ని వదులుకోమని, స్కూల్ గ్రామానికి గర్వకారణమని, ఎంత ఖర్చు అయినా సరే స్కూల్ ని మూసివేయకుండా కాపాడుకుంటామని సెల్వరాజ్ తెలిపారు. స్కూల్ మూసేస్తే ఉపాధ్యాయులు బదిలీ అవుతారు కాబట్టి.. ఇప్పుడు మేల్కొని ఇలాంటి స్కీమ్స్ తీసుకొస్తున్నారని.. ఇన్నాళ్లు ఎందుకు తీసుకురాలేదని ఆ గ్రామంలోని యువత ప్రశ్నిస్తున్నారు. టీచర్ల ఉద్యోగాలకు ఎసరు వచ్చినప్పుడు.. ఇలాంటి స్కీమ్స్ గుర్తుకొస్తాయంటూ నిలదీస్తున్నారు.
po

Posted in Uncategorized

Latest Updates