ఇది పరువు హత్యేనా : పట్టపగలు.. ఆటోలోనే హత్య

murderహైదరాబాద్ సిటీలో కలకలం. ఓ యువకుడిని చంపిన తీరు సంచలనం అయ్యింది. ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. బలవంతంగా తీసుకెళ్లారు. సిటీ రోడ్లపై తిప్పుతూ ఆటోలోనే గొంతుకి వైర్ బిగించి మరీ చంపేశారు. ఈ తర్వాత మృతదేహాన్ని రోడ్డుపై పడేసి వెళ్లిపోయిన వైనం షాక్ కు గురి చేసింది. ఆటోలోనే హత్య.. అదీ పట్టపగలు చేసిన తీరు చూసి పోలీసులు సైతం షాక్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ సిటీలోని గోల్నాక ప్రాంతం మారుతీనగర్ లో సతీష్ (27) నివాసం ఉంటున్నాడు. ఇతను పెయింటింగ్ పనితోపాటు స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారం కూడా చేస్తుంటాడు. ఏప్రిల్ 5వ తేదీ గురువారం మధ్యాహ్నం భార్య హిమబిందుతో కలిసి దిల్ షుఖ్ నగర్ వెళ్లాడు. అక్కడి నుంచి ఇద్దరూ బైక్ పై తిరిగి వస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. వెంటనే సతీష్ ను ఆటోలో ఎక్కించుకున్నారు. భార్య దగ్గర ఉన్న సెల్ ఫోన్ లాక్కున్నారు. ఆమెను రోడ్డుపైకి నెట్టేశారు. సతీష్ ను ఆటోలో ఎత్తుకెళ్లిన దుండగులు అతన్ని తీవ్రంగా కొట్టారు. గొంతుకి వైర్ బిగించి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని గోల్నాక పాత లక్ష్మీ థియేటర్ సమీపంలో రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. స్థానికుల సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చింది.

బంధువులే చంపేశారా?

సతీష్ కొన్ని నెలల క్రితం హిమబిందుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీనిని అమ్మాయి తరపువారు వ్యతిరేకించారు. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయి వీరు పెళ్లి చేసుకున్నారు. మా అమ్మాయిని మాకు కాకుండా చేశారు అనే కోపంతో హిమబిందు తరపు బంధువులు సతీష్ ను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ హత్య కేసుపై విచారణ చేస్తున్నారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates