ఇది మరో అవతారం : రాహుల్ గాంధీని కలిసిన కమల్ హాసన్

RTకాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్. ఢిల్లీలో ఉన్న ఆయన.. రాహుల్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. తమిళనాడు రాజకీయ పరిణామాలతో పాటు.. పొత్తులపై ఇద్దరు నేతలు చర్చించినట్టు తెలుస్తొంది. అంతకు ముందు… తన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ అధికారులను కలిశారు కమల్. పార్టీ ఎన్నికల గుర్తు త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మక్కల్ నీది మైయాం పార్టీకి సంబంధించిన అన్ని వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించినట్లు కమల్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates