ఇది మా పవర్ : ఎలుకలే.. 3 అంతస్తుల బిల్డింగ్ కూల్చేశాయి

rabitఎలుకలు చేసిన పనికి ఓ మూడంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. ఇంత చిన్న సైజు ఉన్న ఎలుకల వల్ల అంత పెద్ద బిల్డింగ్ ఎలా కూలిపోతుందబ్బా అని ఆశ్యర్యపోతున్నారా? అవును నిజమే ఈ ఎలుకలు చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ అయ్యింది.

ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ఉన్న ఓ మూడంతస్తుల బిల్డింగ్ చుట్టుప్రక్కల కొన్నేళ్లుగా ఎలుకల సమస్య తీవ్రంగా ఉంది. ఇళ్ల లోపల కలుగులు చేసుకుని అందులో నివసిస్తూ… మురుగు కాల్వల పైపుల్లోకి జొరబడి వాటిని పాడుచేయడం, ఇళ్ల పునాదుల్లోకి కలుగులు చేసుకుని అందులో నివసిస్తూ ఆ ఏరియా ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. అదే ఏరియాలో ఉన్న ఆలయం సమీపంలోని ఓ మూడంతస్తుల బిల్డింగ్ కింద నివాసం ఏర్పరచుకున్న వేలాది ఎలుకలు పెద్ద ఎత్తున రంధ్రాలు చేయడంతో బిల్డింగ్ పునాది బలహీనపడింది.

ఈ సమయంలో శనివారం(ఏప్రిల్-14) భారీ వర్షాలు రావడంతో వరద నీరు బిల్డింగ్ లోని కలుగుల్లోకి చేరి ప్రమాదకరంగా మారింది. దీంతో ప్రమాదం జరిగే అవకాశముందని ముందే గుర్తించిన బిల్డింగ్ యజమాని.. అందులో నివసిస్తున్న అందరినీ ఖాళీ చేయించాడు. వారు ఖాళీ చేసిన కొద్ది సమయంలోనే ఆ బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎలుకలు వినాయకుడి వాహనాలని, అవి తల్చుకుంటే ప్రపంచంలో ఏమైనా కూలిపోతాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates