ఇది రియల్ : ఆకాశంలో ఢీకొన్న విమానాలు

ఈ ఘటనను చూస్తే ఎవ్వరికైనా హాలీవుడ్ సినిమా గుర్తుకు వస్తుంది. సేమ్ టూ సేమ్ హాలీవుడ్ సినిమాల్లో చూపించే విధంగానే… రెండు విమానాలు గాల్లో ఒకదానినొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన ముగ్గురిలో భారత్ కు చెందిన 19 ఏళ్ల యువతి కూడా ఉంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది.

మియామిలోని  డీన్‌ ఇంటర్‌ నేషనల్‌ ఫ్లైట్‌ స్కూల్‌కు చెందిన పైపర్PA-34, సెస్నా172  రెండు చిన్న శిక్షణ విమానాలు మంగళవారం పైలెట్ ట్రైనింగ్ లో భాగంగా గాల్లో విహరిస్తున్నాయి. ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామి సిటీ దగ్గర్లోని ఎవర్ గ్లేడస్ ప్రాంతంలో.. రెండు విమానాలు గాల్లోనే ఒకదానినొకటి  ఢీ కొన్నాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిష్ట్రేషన్ తెలిపింది. ఈ ప్రమాదంలో భారత్‌ కు చెందిన ట్రైనీ పైలెట్ నిషా సెజ్వాల్‌(19) తోపాటు, జార్జ్‌ శాన్‌ చెజ్‌(22), రాల్ఫ్‌ నైట్‌(72) లు చనిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయినట్లు పోలీసులు కన్ఫర్మ్ చేశారు. విమానంలో ఉన్న నాలుగో వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఫేస్ బుక్ పేజీ ఆధారంగా నిషా సెజ్వాల్ ను గుర్తించినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన ఏరియా అంతా పొడవాటి గడ్డి ఉండటంతో అక్కడికి చేరుకోవడం అధికారులకు  కష్టమైందని, ఎయిర్‌ బోట్స్‌ ద్వారా అక్కడికి చేరుకోగలమని అధికారులు తెలిపారు. సహాయక చర్యలకు వాతావరణం అనుకూలించట్లేదని తెలిపారు. అయితే 2007 నుంచి 2017 మధ్య కాలంలో ఈ స్కూల్ కే చెందిన 30 విమానాలు ప్రమాదానికి గురైనట్టు మిమామి మేయర్‌ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates