ఇది 27వ అవిశ్వాస తీర్మాణం

కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై  శుక్రవారం (జూలై-20)  లోక్‌ సభలో చర్చ జరగనుంది. గత పదిహేనేళ్లలో తొలిసారి జరగనున్న విశ్వాసపరీక్షపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  బీజేపీ నేతృత్వంలోని  ఎన్డీయే ప్రభుత్వం అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవడం ఇది మూడోసారి. గతంలో అటల్‌ బీహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 1999లో ఓసారి , 2003లో మరోసారి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. 1999లో జరిగిన విశ్వాస పరీక్షలో అప్పటివరకూ ఎన్డీయే కూటమిలో ఉన్న BSP లోక్‌ సభలో వ్యతిరేకంగా ఓటు వేయడంతో వాజ్‌ పేయి ప్రభుత్వం  ఒక్క ఓటు తేడాతో కుప్పకూలిపోయింది.

ఇప్పటివరకు జరిగిన అవిశ్వాసం తీర్మానాలు

-1963లో తొలిసారిగా పార్లమెంట్‌లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
– ఇప్పటివరకు 26సార్లు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. నేడు జరుగుతున్నది 27వది.
– 15సార్లు ఇందిరాగాంధీ ప్రభుత్వం అవిశ్వాస పరీక్షను ఎదుర్కొన్నది.
– 25 ఏండ్లలో మూడుసార్లు లోక్‌సభ అవిశ్వాస తీర్మానంపై చర్చించింది. ఒకసారి ప్రభుత్వమే విశ్వాసపరీక్షకు దిగింది.
– జూలై 1993 : బాబ్రీమసీదు కూల్చివేత తర్వాత పీవీ నర్సింహారావు ప్రభుత్వంపై విపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ పరీక్షలో తీర్మానం వీగిపోయి అధికారపక్షం నెగ్గింది.
– ఏప్రిల్ 1999: వాజ్‌పేయి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం. ఒక్క ఓటు తేడాతో ఓడిపోయి కూలిన ప్రభుత్వం.
– ఆగస్టు 2003: వాజ్‌ పేయి సారథ్యంలోని ప్రభుత్వంపై అవిశ్వాసం. ఓటింగ్‌ లో బలాన్ని నిరూపించుకున్న సర్కార్.
-జూలై 2008: భారత్-అమెరికా అణుఒప్పందాన్ని నిరసిస్తూ వామపక్షాలు ప్రభుత్వం నుంచి తప్పుకోవడంతో మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ విశ్వాస పరీక్షకు సిద్ధమైంది. సభలో తన మెజారిటీని నిరూపించుకున్నది.

Posted in Uncategorized

Latest Updates