ఇదీ అభివృద్ధి అంటే : రూపాయికే పేదలకు బీమా

modiజన్‌ధన్ యోజనతో పేదల ఆత్మగౌరవం పెరిగిందన్నారు ప్రధాని మోడీ. నెలకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ప్రీమియంగా తీసుకుని బీమా అందిస్తున్న ఘనత బీజేపీకే దక్కిందన్నారు. పేదలు ఇప్పుడు రూపే డెబిట్ కార్డులను వాడుతున్నారని.. ఉజ్వల స్కీమ్ తో అనేక మంది పేద మహిళలకు లాభం చేకూరిందన్నారు. బుధవారం (ఫిబ్రవరి-7)  మోడీ లోక్‌సభలో మాట్లాడారు.GST ఓ అద్భత సంస్కరణ అన్నారు. పర్సనల్ ఇన్‌కం ట్యాక్స్‌లో మూడేళ్లలో తీసుకువచ్చిన సంస్కరణలను మోడీ మెచ్చుకున్నారు. మధ్యతరగతి ఉన్నత విద్యను ఆశిస్తున్నారని.. ఈజ్ ఆఫ్ లీవింగ్‌కు కట్టుబడి ఉన్నామన్నారు.

ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని బలోపేతం చేయటం ద్వారా ఆహార ఉత్పత్తుల వ్యర్థాన్ని తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు. అవినీతిపరులు దోచుకున్న సొమ్మును వెనక్కి తెచ్చేందుకు వెనుకడుగు వేయబోమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అప్పుల కారణంగానే పారిశ్రామిక రంగంలో సంక్షోభం ఏర్పడిందన్నారు మోడీ. NDA ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన రుణాల్లో ఒక్క NPA కేసు (దివాళా) లేదన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన రుణాలు ఎన్‌పీఏగా మారలేదన్నారు.

కుంభకోణాలు చేసేవారిని వదిలేది లేదు..

కుంభకోణాలు చేసిన వారిని వదిలి పెట్టబోమని హెచ్చరించారు ప్రధాని మోడీ. బ్యాంకులకు వేల కోట్లు ఎగవేతలు.. కాంగ్రెస్‌ పాపమేనన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత..  దీర్ఘకాలిక లక్ష్యాలతో పని చేస్తున్నామని, విద్యుత్‌ ఉత్పత్తి, పొదుపుపై దృష్టిపెట్టామన్నారు. మధ్య తరగతి ఆకాంక్షలైన విద్య, సొంతింటి కల నెరవేరుస్తున్నామని తెలిపారు ప్రధాని మోడీ..

Posted in Uncategorized

Latest Updates