ఇదీ.. ప్రాణం ఖరీదు : రూ.100 కోసం వ్యక్తి హత్య

sucideలక్ష కాదు..వేలు కాదు..ఒకే ఒక్క వంద రూపాయల కోసం గొడవపడ్డారు. ఆ గొడవకాస్త ముదిరింది. చివరకు ఓ ప్రాణం బలి అయ్యింది. వంద రూపాయల కోసం ఓ వ్యక్తిని హత్య చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని మూసాపేటలో జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.  ఓ మనిషి ప్రాణం విలువ ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ.

రోజూ వారి కూలీ అయిన పాషా అనే వ్యక్తి కొందరు వ్యక్తులతో రూ. 100 కోసం గొడవ పడినట్లు తెలిసింది. దీంతో వారి మధ్య గొడవ కాస్త పెరిగి.. పెద్దదవడంతో పాషాను వాళ్లు కర్రలతో కొట్టి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Posted in Uncategorized

Latest Updates