ఇదీ సర్కార్ దమ్ము : బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టి తీరతాం

bayyaramకేంద్రం సహకరించినా.. సహకరించకపోయినా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టి తీరతాం అన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి ప్లాంట్ ఏర్పాటు చేస్తుందన్నార. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా.. వందకి 100శాతం తెలంగాణ ప్రభుత్వం – సింగరేణి – టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కట్టి ఏర్పాటు చేసి తీరతాం అన్నారు. ఆ ప్రాంతంలోని 10, 15వేల మందికి ఉద్యోగాలు కూడా ఇస్తాం అని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే మంచిదని.. సహకరించకపోయినా పర్వాలేదు అన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం అని.. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు త్వరలోనే సాకారం అవుతుంది అన్నారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates