ఇదేం ఆచారం: బతికిఉన్న భార్యలకు పిండం పెట్టిన భర్తలు

ఎక్కడైనా చనిపోయిన వారికి మాత్రమే పిండ ప్రదానం చేస్తారు. అయితే మహారాష్ట్రలోని నాసిక్ లో ఇందుకు విరుద్ధంగా జరిగింది. భార్యలు బతికి ఉండగానే వారి భర్తలు గోదావరి నదిలో పిండ ప్రదానం చేసి..నదిలో తర్పణాలు వదిలారు.ఈ కార్యక్రమం మొత్తం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

వాస్తవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం(అక్టోబర్-7) జరిగిన కార్యక్రమంలో దాదాపు 100 మంది భర్తలు పాల్గొన్నారు. భార్యలు బతికి ఉండగానే భర్తలు ఇలాంటి పని చేయడంపై సోషల్ మీడియాలో రచ్చ అవుతోంది. అయితే ఇలా చేయడంతో భార్యలు శాంతించి తమకు విముక్తి కల్పిస్తారనే నమ్మకముందంటున్నారు భార్యా బాధితులు.

Posted in Uncategorized

Latest Updates