ఇదేం కాలం : మాడు పగులకొడుతున్న ఎండలు

TPPవర్షాకాలంలోనూ తెలుగు రాష్ట్రాలు సమ్మర్ ను తలపిస్తున్నాయి. ఎండలు తగ్గినట్లే తగ్గి…నాలుగు రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. వడగాలులు భయపెడుతున్నాయి. గురు, శుక్రవారం కూడా ఎండల తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు నెమ్మదించడంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగిందన్నారు.

గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు ఎక్కువ నమోదు అవుతున్నట్లు తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు టచ్ అవుతుంది. పూర్తిగా పొడి వాతావరణం ఉంది. మొన్నటికి మొన్న వారం రోజులు కూల్ వెదర్, మోస్తరు వర్షాలతో చల్లబడిన ప్రజలు.. మళ్లీ ఇప్పుడు ఎండలు ముదరటంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. చిన్న పిల్లలు అయితే జ్వరాలు, జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు.

మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందన్నారు అధికారులు. మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్పారు. ఈ రెండింటి ప్రభావంతో రెండు రోజులు అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates