ఇదేం విడ్డూరం : గుడ్లు పెడుతున్న యువకుడు!

EGGటైటిల్ చూసి ఎకసెక్కాలు వద్దు అనొద్దు.. ఇది పచ్చి నిజం. రెండేళ్లుగా 20 గుడ్లు పెట్టాడు ఓ యువకుడు. అచ్చం కోడి గుడ్డు ఆకారంలో ఉన్న ఇవి.. ఆ యువకుడి మల విసర్జన ప్రాంతం నుంచి బయటకు వస్తున్నాయి. ఇది నిజం అని అక్మల్ కుటుంబ సభ్యులు చెబుతుంటే.. డాక్టర్లు మాత్రం పరీక్షలు చేస్తూ నిగ్గుతేల్చే పనిలో ఉన్నారు. వివరాల్లోకి వెళితే..

ఇండోనేషియా దేశం గోవ ప్రాంతంలో నివాసం ఉంటాడు అక్మల్. ఇతడి వయస్సు 14 సంవత్సరాలు. 2016 నుంచి ఇప్పటి వరకు 20 గుడ్లు పెట్టాడంటూ అతని తండ్రి చెబుతున్నాడు. ఈ విషయంపై డాక్టర్లను సంప్రదించాడు అక్మల్ తండ్రి. ఆస్పత్రికి తీసుకొచ్చిన తర్వాత కూడా రెండు గుడ్లు పెట్టాడని చెబుతున్నారు. ఆస్పత్రి బెడ్ పై పడుకుని ఉన్న ఆక్మల్ నుంచి బయటకు వచ్చిన గుడ్డు వీడియోను కూడా చూపిస్తున్నారు. రెండేళ్లుగా 20 గుడ్లు పెడుతున్నాడని గట్టిగా చెబుతున్నారు. ఇప్పటికీ ఆక్మల్ ను ఆస్పత్రిలోనే ఉంచి వైద్య పరీక్షలు చేస్తున్నారు డాక్టర్లు.

అక్మల్ గుడ్డు పెడుతున్న విషయంలో అంతర్జాతీయ పత్రికల్లో రావటంతో చర్చనీయాంశం అయ్యింది. గోవ పట్టణంలోని సైక్ యూసఫ్ ఆస్పత్రి ప్రత్యేక వైద్య సిబ్బందిని నియమించి మరీ అక్మల్ శరీరం మొత్తం స్కానింగ్ చేస్తున్నారు. కోడి లేదా బాతు గుడ్లను మింగితే.. అవి యథావిధిగా బయటకు వచ్చి ఉండొచ్చని చెబుతున్నారు డాక్టర్లు. అక్మల్ కుటుంబ సభ్యులు మాత్రం డాక్టర్ల వాదనను కొట్టిపారేస్తున్నారు. ఎలాంటి గుడ్లు మింగలేదని వాదిస్తున్నారు. కొన్ని పగలకొట్టి చూశాం అని.. లోపల అంతా వైట్ గా ఉందని చెబుతున్నారు. మొత్తంగా యువకుడు గుడ్ల విషయం మాత్రం బీభత్సం అయిపోయింది. నిజమా – కాదా అనేది మాత్రం తేల్చాల్సింది డాక్లర్లే.. మరికొంత సమయం పట్టొచ్చు..

Posted in Uncategorized

Latest Updates