ఇదేనా విశ్వాసం : పీకలదాక బిర్యానీ మెక్కారు.. డబ్బులు అడిగితే కాల్చి చంపారు

BIRYANI DEATH KOLKATAమనిషి ప్రాణాలంటే లెక్కలేకుండా పోతోంది. డబ్బుల కక్కుర్తితో ఎంతటికైనా దిగ జారుతున్నారు కొందరు దుర్మార్గులు. ఇటీవల హైదరాబాద్ లోని మూసాపేటలో వంద రూపాయల కోసం ఓ వ్యక్తిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రాణం ఖరీదు కాస్త పెరిగింది. రూ. 190 కోసం చంపేశార.  పశ్చిమ బెంగాల్‌ లో ఓ హోటల్ యాజమానిని దారుణంగా హత్య చేశారు. కడుపునిండా బిర్యాని తిని ఆఖరికి తిన్నదానికి డబ్బులు చెల్లించాలని అడిగినందుకు దారుణంగా చంపేశారు.

నలుగురు కస్టమర్లు ప్లేట్‌ కు తలో రూ.190 చెల్లించాలని అతడు కోరడంతో ఆ ఘటనకు పాల్పడ్డారు. బిర్యాని తిన్న తరువాత డబ్బులు చెల్లించాలని హోటల్ యాజమాని సంజయ్ మండల్ నలుగురు కస్టమర్లను కోరాడు. దీంతో కస్టమర్లు, సంజయ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  సహనం కోల్పోయిన ఒక కస్టమర్ అతడి దగ్గరున్న తుపాకీతో సంజయ్‌ పై కాల్పులు జరిపాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. బిర్యానీ ధరపై ఈ గొడవ జరిగిందా.. లేక మరే ఇతర కారణాలను దృష్టిలో ఉంచుకొని నిందితుడు కాల్పులు జరిపాడా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. FIR నమోదు చేసిన పోలీసులు.. నలుగురిలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అయితే సంఘటనపై మండిపడుతున్నారు స్థానికులు. డబ్బులు లేకుంటే రిక్వెస్ట్ చేసుకోవాలి, లేదంటే ఏదైనా వస్తువు తకట్టు పెట్టుకోవాలి తప్పా..ఇలా అన్నంపెట్టిన వాడినే చంపేస్తారా..ఇదేనా విశ్వాసం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

 

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates