ఇదో వెరైటీ : గుడ్డు పెట్టిన కోడిపుంజు

ఎక్కడైనా కోడిపెట్ట గుడ్డు పెట్టడం కామన్. కానీ పుంజు గుడ్డు పెట్టడం విచిత్రం. ఇలాంటి విచిత్ర సంఘటన గురువారం(జులై-12) సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండలం ఫత్తేపూర్‌ గ్రామంలో జరిగింది.
ఫత్తేపూర్ గ్రామంలో నివసించే మల్లుగొండ అనే వృద్దుడు ఓ నాటు కోడిపుంజును పెంచుకున్నాడు. రోజూలానే.. బుధవారం రాత్రి నిద్రపోయే సమయంలో కోడిపుంజును గంప కింద ఉంచాడు. ఉదయాన్నే గంప ఎత్తి చూడగానే కోడిపుంజు గుడ్డు పెట్టి ఉండటం చూసి మల్లుగొండ షాక్ అయ్యాడు. అసలు కోడిపుంజు గుడ్డు ఎలా పెట్టిందో తెలియక ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఇదెక్కడి వెరైటీరా బాబు అనుకున్నాడు. విషయం తెలియంతో గ్రామస్ధులందరూ మల్లుగొండ ఇంటికి వచ్చి పుంజు పెట్టిన గుడ్డుని చూసి వెళ్తున్నారు. విషయం… ఆ నోటా..ఈ నోటా పాకడంతో చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఈ వింత ఘటనను చూసేందుకు తరలివచ్చారు. సోషల్ మీడియాలో పుంజు పెట్టిన గుడ్డు అంటూ ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే జన్యు లోపం కారణంగానే ఇలా జరిగి ఉండవచ్చని మండల పశువైద్యాధికారి తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates