ఇదో వైరల్ కథ : కోతికి మేకప్ వేసి.. హల్ చల్ చేస్తున్నారు

variety-animalమూడు రోజులుగా సోషల్ మీడియాలో ఇదే తంతు.. కర్నాటక రాష్ట్రం మారుమూల గ్రామంలో గ్రహాంతరవాసి అంటూ ప్రచారం. వాట్సాప్ ఆన్ చేస్తే చాలు ఏదో ఒక గ్రూప్ ఈ ఫొటోలు, వీడియోలు దర్శనం ఇస్తున్నాయి. భూమిపై గ్రహాంతరవాసులు దిగాయని.. పశువులపై దాడి చేశాయంటూ ఒకటే గోల. ఎంతగా ఇది జనంలోకి వెళ్లింది అంటే.. ఇంట్లోని గృహిణుల స్మార్ట్ ఫోన్లలోకి కూడా చొరబడింది. ఏకంగా కొన్ని టీవీ ఛానల్స్ ప్రసారం చేయటంతో మరింత కలకలం రేపింది. ఇదంతా తప్పుడు వార్త అని ఖండిస్తున్నా.. వైరల్ మాత్రం ఆగటం లేదు. అసలు వివరాల్లోకి వెళితే..

కొంత మంది యువకులు.. కోతిని పట్టుకొచ్చారు. దానికి మేకప్ వేశారు. ముఖానికి గ్రహాంతరవాసి ఆకారం తీసుకురావటానికి కష్టపడ్డారు. మిగతా శరీరం కనిపించకుండా నల్లటి వస్త్రం కప్పారు. ముఖం హావభావాలు కనిపించకుండా పూర్తిగా తెల్ల రంగు పూసేశారు. చుట్టూ మనుషులు ఉండటంతో ఆ కోతి ఎటూ వెళ్లలేక ఇబ్బంది పడుతుంది. దీనికితోడు ఓ యువకుడు కర్రను కోతి దగ్గరగా తీసుకెళ్లటం.. అది పట్టుకోవటానికి ప్రయత్నించటం స్పష్టంగా కనిపిస్తోంది. కోతినే.. గ్రహాంతరవాసిగా నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత దాన్ని పట్టుకుని కట్టేశారు. ఇక్కడ కూడా స్పష్టంగా తెలుస్తోంది.. ఈ కోతి కింద కాళ్లతో పరిగెత్తటానికి ప్రయత్నిస్తున్నట్లు. అసలు ఇది కర్నాటకలో జరిగిందో.. మరెక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఇది మాత్రం కోతి అని గట్టిగా చెబుతున్నారు. కొంత మంది కావాలనే వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని.. గ్రహాంతర వాసి కాదని తేల్చేస్తున్నారు నెటిజన్లు.

ఓ వీడియో కొంచెం మసాలా వార్త తగిలించటంతో.. నాలుగు రోజులుగా వాట్సాప్ లో హల్ చల్ చేస్తోంది. గ్రూపులకు గ్రూపులు దీన్ని షేర్ చేస్తుండటంతో.. ఏకంగా టీవీలకే ఎక్కేసింది. ఓ ఫేక్ సమాచారం.. ఎంతలా వైరల్ అవుతుందో చెప్పటానికి ఇది లేటెస్ట్ ఉదాహరణ. సో.. నెటిజన్స్.. ఇది గ్రహాంతర వాసి కాదు.. కోతికి మేకప్ వేసి తీసిన వీడియో..

viral variety animal

viral variety animal

Posted by Viral Bits on 2018 m. Birželis 4 d., Pirmadienis

Posted in Uncategorized

Latest Updates