ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య

దాలదఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటర్మీడియట్ లో ఫెయిల్ కావడంతో హైదరాబాద్ కూకట్ పల్లిలోని కైతల్లాపూర్ కు చెందిన కట్రాజ్ కిరణ్ అనే 16 ఏళ్ల  విద్యార్ధి సూసైడ్ చేసుకున్నాడు. పరీక్ష తప్పడంతో మనస్థాపం చెందిన కిరణ్ శుక్రవారం(ఏప్రిల్-13) మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మేడ్చల్ జిల్లా పీర్జదిగూడ మల్లికార్జున నగర్ కు చెందిన దూలం వర్షం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వర్ష ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అయ్యింది.

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం గుంటూరుపల్లికి చెందిన సూదిరెడ్డి అనే స్టూడెంట్ ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చాయని పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడి పరిస్థితి విషమించడంతో MGM కు తరలించారు.

Posted in Uncategorized

Latest Updates