ఫస్ట్ టైం.. ఇద్దరు జడ్జిలకు కరోనా

కోల్‌కతా: ఇద్దరు జడ్జిలకు కరోనా వైరస్ సోకింది. పశ్చిమ బెంగాల్‌ అలీపూర్ జిల్లాలోని సివిల్, సెషన్స్ కోర్టు న్యాయమూర్తులు ఇద్దరికి కరోనా వచ్చిందని రాష్ట్ర హెల్త్ డిపార్ట్ మెంట్ శనివారం ప్రకటించింది. బాధితులిద్దరిని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఐసోలేషన్ వార్డుకు తరలించామని, వారితో కాంటాక్టు అయిన వారిని హోంక్వారంటైన్ లో ఉంచినట్లు ఆరోగ్య అధికారి వెల్లడించారు. రాష్ట్రంలో న్యాయమూర్తులకు కరోనా సోకడం ఇదే మొదటిసారి అని చెప్పారు. పశ్చిమ బెంగాల్​లో ఇప్పటివరకు 7,303 మంది వైరస్ బారిన పడగా 2,912 మంది రికవరీ అయ్యారు. 366 మంది వైరస్​తో  చనిపోయారు.

Latest Updates