ఇన్నాళ్లకు స్వేచ్చ : సౌదీలో అర్ధరాత్రి కార్లు డ్రైవ్ చేస్తూ మహిళల సందడి

soudఅర్ధరాత్రి  కార్లను డ్రైవ్ చేస్తూ  సౌదీలో మహిళలు రోడ్లపై సందడి చేశారు. రోడ్డుపై వెళ్లేవారికి గ్రీటింగ్స్ చెప్తూ ఎంజాయ్ చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దశాబ్దాలుగా సౌదీ అరేబియాలో మహిళల డ్రైవింగ్ పై ఉన్న నిషేధం  ఆదివారంతో అధికారికంగా ముగిసిపోయింది. నిషేధం ముగియడంతో రాజధాని రియాద్‌లో శనివారం అర్ధరాత్రే మహిళలు కారు డ్రైవింగ్‌ చేస్తూ రోడ్లపైకి చేరారు. తమకు  స్వేచ్ఛ లభించినందుకు మహిళలు కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. సంస్కరణల్లో భాగంగా గత ఏడాది సెప్టెంబర్‌లో సౌదీ రాజు సల్మాన్‌ మహిళల డ్రైవింగ్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మహిళల డ్రైవింగ్‌ పై నిషేధం తొలగిపోవడంతో  సౌదీలోని కొన్ని సంస్థలు తమ కంపెనీల్లో పనిచేస్తున్న మహిళలకు డ్రైవింగ్‌ శిక్షణ ఇప్పించేందుకు రెడీ అయ్యాయి. ఆదివారం నుంచి నిషేధం ఎత్తివేత అమలులోకి  రావడంతో సౌదీ అరేబియా నిర్ణయాన్ని మిత్రదేశాలు అభినందించాయి.

 

Posted in Uncategorized

Latest Updates