ఇన్ డిస్ ప్లే కెమెరాతో శాంసంగ్ గెలాక్సీ A8S స్మార్ట్ ఫోన్

సౌత్ కొరియా కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్  ప్రపంచంలో మొదటి ఇన్ డిస్ ప్లే కెమెరా స్మార్ట్ ఫోన్ గెలాక్సీ A8S ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో ఏర్పాటు చేసిన ఇన్ డిస్ ప్లే కెమెరాను.. ఇన్ఫినిటీ ఓ డిజైన్ గా శాంసంగ్ పిలుస్తోంది.

6.4 ఇంచెస్ బిగ్ డిస్‌ప్లే, 24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ లో హైలైట్ ఫీచర్లు. ఈ ఫోన్‌ వెనుక భాగంలో 24, 10, 5 మెగాపిక్సెల్ కెమెరాలు మూడింటిని ఏర్పాటు చేశారు. బ్లూ, గ్రే, గ్రీన్ కలర్ వేరియెంట్లలో లభించే ఈ ఫోన్ డిసెంబర్ 21నుంచి కస్టమర్లకు లభ్యం కానుంది. ఫోన్ ధరను ఇంకా అనౌన్స్ చేయలేదు.

శాంసంగ్ గెలాక్సీ A8S ఫోన్ స్పెసిఫికేషన్స్

6.4 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్

6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్

512 జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ

ఆండ్రాయిడ్ 8.1 Oreo  ఆపరేటింగ్ సిస్టం

ఇన్ డిస్ ప్లే కెమెరా(24 మెగాపిక్సెల్)

24, 10, 5 మెగాపిక్సెల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు

3400 mAh బ్యాటరీ

 

 

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates