ఇన్ ఫెక్షన్ తగ్గలేదు : నిలకడగానే వాజ్ పేయి ఆరోగ్యం

Atal-Bihari-Vajpayeeమాజీ ప్రధానమంత్రి వాజ్ పేయికి ఇన్ ఫెక్షన్ సోకిందని.. మరికొన్ని రోజులు ఢిల్లీ ఎయిమ్స్ లోనే చికిత్స అందించనున్నట్లు ప్రకటించారు వైద్యులు. వాజ్ పేయి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన ఆస్పత్రి.. ప్రస్తుతం నిలకడగా ఉందని వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఊపిరితిత్తుల వ్యాధితోపాటు కిడ్నీకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల్లో ఒకటి సరిగా పని చేయటం లేదని తెలిపారు. కిడ్నీ సంబంధ వ్యాధికి డయాలసిస్ చేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా ఇంట్లోనే చికిత్స అందిస్తున్నా.. ఇన్ ఫెక్షన్ సోకటంతో ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం క్రిటికల్ గానే ఉన్నా.. నిలకడగా అయితే ఉందని.. ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న వాజ్ పేయిని బీజేపీ మోస్ట్ సీనియర్ నేత అద్వానీ, ప్రధానమంత్రి మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, నడ్డా ఇతర మంత్రులతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఎయిమ్స్ ఆస్పత్రిలో వాజ్ పేయిని పరామర్శించారు. డైరెక్టర్ డాక్టర్ రణదీప్ ఆధ్వర్యంలోనే వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.

Posted in Uncategorized

Latest Updates