ఇప్పటి నుంచి మరో లెక్క : పుతిన్ తో భేటీపై ట్రంప్

ఫిన్లాండ్  రాజధాని హెల్సింకి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ సమావేశమయ్యారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా రష్యా ఫిఫా వరల్డ్ కప్ ను నిర్వహించడాన్ని తాను అభినందిస్తున్నానని ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు. ఇరు దేశాలు గొప్ప అవకాశాలు కలిగి ఉన్నాయని, కొన్నేళ్లుగా రష్యాతో సంబంధాలు అధ్వాన్నంగా ఉండటానికి అమెరికా మూర్ఖత్వమే కారణమని ట్రంప్‌ తెలిపారు.  ఇకపై అమెరికా-రష్యా అధ్భుతమైన సంబంధాలతో దీనికి పుల్ స్టాప్ పెడతామని ట్రంప్ తెలిపారు. వాణిజ్యం, మిలటరీ, మిసైల్స్, న్యూక్లియర్, చైనా తదితర అంశాలపై ట్రంప్, పుతిన్ చర్చింకున్నారు. అయితే ఇద్దరి కామన్ ఫ్రెండ్ చైనా గురించి.. ఈ భేటీలో తక్కువ చర్చ జరిగింది.

Posted in Uncategorized

Latest Updates