ఇప్పటి ప్రముఖుడు అప్పట్లో వేధించాడు.. గుత్తా జ్వాల ట్వీట్లు

ఇంటర్నెట్ :  తనకు కలిగిన చేదు అనుభవాలను ట్విట్టర్ లో పంచుకుంటూ… ‘మీ టూ’ ఉద్యమానికి మద్దతు తెలిపింది బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల. 2006 లో అప్పటి ప్రముఖుడు.. ఇప్పుడు చీఫ్ గా ఉన్న ఓ వ్యక్తి వేధించిన కారణంగా తన కెరీర్ పతనం అయ్యిందని ట్విట్టర్ లో ఆరోపించింది గుత్తాజ్వాల. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు.. తాను నేషనల్ ఛాంపియన్ ఐనప్పటికీ… తనను జాతీయ జట్టు నుంచి కొద్దిరోజులు తొలగించాడని అన్నది. రియో ఒలింపిక్స్ నుంచి రిటర్న్ అయ్యినప్పుడు కూడా నేషనల్ టీమ్ నుంచి మరోసారి అతడే తప్పించాడని చెప్పింది. ఇతడి కారణంగానే తాను ఆడటం ఆపేశానని చెప్పింది గుత్తా జ్వాల.

ఆ బ్యాడ్మింటన్ ప్రముఖుడు తనను మానసికంగా వేధించేవాడంటూ గుత్తాజ్వాల ట్విట్టర్ లో తెలిపింది. దీనిపై పలువురితో ట్విట్టర్ లో డిస్కస్ కూడా చేసింది. ఆ ముఖ్యుడు మానసికంగా వేధించినా అది హెరాస్ మెంట్ కిందకే వస్తుందని అన్నది. “ఆయన నా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాడు. వాళ్లపై దాడి చేశాడు. నన్ను ఒంటరి దాన్ని చేయాలని ఎంతగానో ప్రయత్నించాడు. ప్రపంచ నంబర్ 9గా ఉన్న నేను మానసికంగా ఎంతో కుంగిపోవాల్సి వచ్చింది” అని ట్వీట్‌ చేసింది.

Posted in Uncategorized

Latest Updates