ఇప్పటి వరకు లెక్క ఇదీ : రూ.6వేల కోట్ల నీరవ్ ఆస్తులు సీజ్

nirav-modiపంజాబ్ నేషనల్ బ్యాంక్ కు రూ.11వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ ఆస్తులను సీజ్ చేస్తున్నారు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు. వారం రోజులుగా తనిఖీలు చేస్తున్న ఈడీ.. ఫిబ్రవరి 24వ తేదీ శనివారం ఒక్కరోజే రూ.523.72 కోట్ల విలువైన స్థిరాస్తులను సీజ్ చేసింది. ఇందులో అలీబాగ్ లో ఉన్న ఫాంహౌస్, సోలార్ పవర్ ప్లాంట్ ఉన్నాయి. వీటితోపాటు అహ్మద్ నగర్ లోని 135 ఎకరాల భూమిని కూడా అటాచ్ చేశారు.

ముంబై, పూణెలో ఉన్న నీరవ్ మోడీకి చెందిన డైమండ్ షోరూంలను కూడా ఈడీ సీజ్ చేసింది. ఆఫీసులను కూడా స్వాధీనం చేసుకున్నది. భూములు, డైమండ్స్, భవనాల విలువ మార్కెట్ అంచనా ప్రకారం రూ.6వేల కోట్ల వరకు ఉండొచ్చని చెబుతున్నారు అధికారులు. ఈ సోదాలు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయని.. ఎన్ని ఆస్తులు సీజ్ చేసింది.. వాటి విలువ ఎంత అనేది పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.

Posted in Uncategorized

Latest Updates