ఇప్పుడంతా డూప్ లే : ఎస్వీఆర్ శతజయంతి ఉత్సవాల్లో వెంకయ్య

SVRఎస్వీ రంగారావు యశస్వి అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రవీంద్రభారతిలో విశ్వనటచక్రవర్తి ఎస్వీ రంగారావు శతజయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన…. NTR, ANR తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రెండుకళ్లైతే, ఎస్వీఆర్ గుండెకాయ లాంటి మనిషన్నారు. ఎస్వీ రంగారావు నటన మరెవరికీ సాధ్యం కాదన్నారు. ఆకట్టుకునే ఆహార్యం, కంటి చూపు, చేయి కదలిక, మాట విరుపు, ఇలా ఆయనలో, ఆయన నటనలో అణువణువూ ప్రత్యేకమేనని వెంకయ్య అన్నారు. దుర్యోధనుడి ఆభిజాత్యం కావచ్చు… ఘటోత్కచుడిలోని చతురత కావచ్చు… కంసుడిలోని క్రూరత్వం కావచ్చు… కీచకుడిలోని జిత్తులమారి తనం కావచ్చు… రావణుడిలోని భీకర తత్వం కావచ్చు… భీష్ముడిలోని ఔచిత్యం కావచ్చు.. ఇలా ఏ రసమైనా, ఏ పాత్రనైనా, అలవోకగా, వారు అచ్చంగా ఇలానే ఉండేవారా అన్నంత ఆవలీలగా వెండితెరపై ఆవిష్కరించడం ఎస్వీఆర్ కు తెలిసినట్లు ఎవరికీ తెలియదేమోనని వెంకయ్య అన్నారు. నేటి తరంలో అందమైన నటులున్నారు కానీ, అందమైన నటన లేదని వెంకయ్య అన్నారు. నాటి సినిమాలకు …నేటి సినిమాలకు చాలా తేడా ఉందన్నారు. అప్పటి మూవీల్లో నటులు ప్రాణంపెట్టి నటించేవారనీ, ఇపుడంతా ఉత్తి డూప్ లే అన్నారు.

Posted in Uncategorized

Latest Updates