ఇమ్రాన్ ఖాన్ కు మోడీ ఫోన్

ఇమ్రాన్ ఖాన్ కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. పాక్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించిన క్రమంలోనే శుభాకాంక్షలు తెలిపారు మోడీ. రాబోయేరోజుల్లో పాక్‌ తో సత్సంబంధాలకు భారత్‌ సిద్ధంగా ఉందని.. ఇరు దేశాల ఒక సంయుక్త కార్యాచరణ ప్రణాళిక ఉండాలని ఆకాంక్షించారు. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని.. రక్తపాతాలతో సమస్యలకు పరిష్కారాలు లభించవని ఇమ్రాన్‌ తో మాట్లాడారు మోడీ. చైనా-పాకిస్థాన్‌ సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని, ఆ దేశం నుంచి పాఠాలు నేర్చుకుంటామని చైనా భాషలో ఇమ్రాన్‌ చేసిన ట్వీట్‌పై చైనా మీడియా ప్రత్యేక కథనాలను ప్రచురించింది. చైనా అనుసరిస్తున్న విధానాలను అందిపుచ్చుకుని.. పాక్‌ లోని లక్షల మంది పేదలకు ఉన్నత జీవితాలను అందిస్తామని ఖాన్‌ ఆ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ ఆగస్టు 11న ప్రమాణస్వీకారం చేస్తారు.

Posted in Uncategorized

Latest Updates