ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్ళి చేసుకున్నారు

imranమాజీ క్రికెటర్‌, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌  అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ మూడో వివాహం చేసేసుకున్నారు. ఆధ్మాత్మిక గురువు బుష్రా మనేకాను పెళ్లి చేసుకున్నట్లు PTI అధికారికంగా తెలిపింది. ఆదివారం లాహోర్‌లోని బుష్రా మనేకా(పింకీ పీర్‌) సోదరుడి ఇంట్లో ఈ వేడుక జరిగింది. జనవరి నుంచి వీరిద్దరి వివాహం గురించి మీడియాలో ప్రముఖంగా వార్తలు రాగా.. పీటీఐ వాటిని ఖండిస్తూ వస్తోంది.

1992లో పాక్‌ జట్టుకు క్రికెట్‌ ప్రపంచ కప్‌ సాధించిపెట్టిన తర్వాత విపరీతమైన క్రేజ్‌ను పొందిన ఇమ్రాన్‌.. మొదట బ్రిటిష్‌ జర్నలిస్టు జెమీమాను మ్యారేజ్ చేసుకున్నారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయి.. జర్నలిస్టే అయిన రేహమ్‌ను(2015లో) రెండోపెళ్లి చేసుకున్నారు. 10నెలలు కూడా గడవకముందే ఆ బంధం కూడా తెగిపోయింది. కొంతకాలంగా ఆయన ఒంటరిగా ఉంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates