ఇమ్రాన్ ప్రమాణస్వీకారానికి పాక్ వెళ్తున్నా : సిద్ధూ

పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్.. ఆగస్ట్ 11న ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. దానికి హాజరవుతానని ప్రకటించారు పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ. దేశాల మధ్య వైరంతో సంబంధం లేకుండా తనకు ఆహ్వానం లభించడం గొప్ప గౌరవంగా భావిస్తానన్నారు. అందుకే ఇమ్రాన్ ఓత్ టేకింగ్ వెళ్తానన్నారు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ కు వరల్డ్ కప్ అందించిన నిబద్ధత గల వ్యక్తి.. అతని వ్యక్తిత్వం గొప్పదని పొగిడారు సిద్ధూ.

క్రీడాకారులు దేశాల మధ్య అడ్డుగోడలు తొలగించి.. జనాన్ని ఏకం చేస్తారన్నారు. మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ కు ఇన్విటేషన్ అందింది. మరోవైపు ఇమ్రాన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి సార్క్ ధేశాధినేతలను కూడా ఆహ్వానించే యోచన చేస్తుంది పీటీఐ పార్టీ. ప్రధాని మోడీ కూడా ఇమ్రాన్ ప్రమానస్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముంది. పాక్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది ఇమ్రాన్ ఖాన్ సారధ్యంలోని పీటీఐ పార్టీ. ఈ సందర్భంగా సోమవారం(జులై-30) ఇమ్రాన్ కు మోడీ శుభాకాంక్షలు తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates