ఇరగదీస్తున్న రజనీ: “కాలా” ఫైటింగ్ సీన్ లీక్

leakబాలీవుడ్, హాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీ అయినా సరే రజనీ మానియాకు తల వంచాల్సిందే. రజనీ సినిమా స్టార్ అయింది అని ప్రకటన వస్తే చాలు సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తారు రజనీ అభిమానులు. వరుసగా కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సరే రజనీకాంత్ స్టామినా కానీ, ఆయనపై ఎట్రాక్షన్ కానీ జ‌నాల‌లో ఏమాత్రం తగ్గలేదు. ఆ క్రేజ్ రజనీ హిట్స్ కు, ఫ్లాప్స్ కు సంబంధం లేకుండా ఉంది. అయితే ర‌జినీకాంత్ ప్ర‌స్తుతం కాలా సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో విలన్లను కొడుతున్న సీన్ లో రజనీ లుక్ ఇప్పుడు అందరినీ అలరిస్తుంది. ఎడిటింగ్ టైంలోనే ఇది బ‌య‌ట‌కు వ‌చ్చి ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ముంబయిలోని తమిళనాడుకు చెందిన ఓ దాదా జీవితం ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ  హీరోయిన్ న‌టిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న విడుద‌ల కానుందని సినిమా యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

Posted in Uncategorized

Latest Updates