ఇరాక్ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : మోడీ

mdఇరాక్ లో ISIS  టెర్రరిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 39 మంది భారతీయుల కుటుంబాలకు ఈరోజు(ఏప్రిల్3) ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోడీ. ఒక్కో భాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు మోడీ తెలిపారు. మృతుల్లో 27 మంది పంజాబ్ కు చెందినవారు ఉండగా.. నలుగురు హిమాచల్ ప్రదేశ్, ఆరుగురు బీహార్, ఇద్దరు వెస్ట్ బెంగాల్ కు చెందినవారున్నారు.

ఇప్పటికే పంజాబ్ కు చెందిన భాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ సోమవారం(ఏప్రిల్2) ప్రకటించారు. ఇరాక్ లోని మోసూల్ లో టెర్రరిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 39 మంది భారతీయులలో 38 మంది మృతదేహాలను విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వీకే సింగ్‌ సోమవారం(ఏప్రిల్ 2) భారత్‌కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

 

Posted in Uncategorized

Latest Updates