ఇరాన్ లో మిలటరీ పెరేడ్ పై ఉగ్రదాడి..

ఇరాన్ లో ఉగ్రవాదులు పంజా విసిరారు. సౌత్ వెస్ర్టన్ సిటీలోని  ఆవాజ్ ప్రాంతంలో మిలటరీ పెరేడ్ జరుగుతుండగా సైనిక దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులు… పెరేడ్ చూస్తున్న ప్రజల తో పాటు పెరేడ్ లో పాల్గొన్న సైనికుల పై  10 నిమిషాల పాటు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు 29 మంది చనిపోగా, 70 మంది వరకు గాయపడినట్లు సమాచారం. తర్వాత భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడిక్కడే మృతి చెందగా… ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రేక్ష‌కులు కూర్చున్న గ్యాలరీ వైపు నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చకుంటామని ఇరాన్ అధ్య క్షుడు రౌహానీ తెలిపారు.   ఉగ్రదాడి తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.

Posted in Uncategorized

Latest Updates