ఇరిగేషన్ లో జోషీ బాగా పని చేశారు : హరీశ్

IMG_1618-597x398ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ చీఫ్ గా ఎస్ కే జోషి బాగా పనిచేశారని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. బుధవావరం (ఫి బ్రవరి-14) మంత్రి హరీశ్ తో పాటు సెక్రెటేరియట్ ఉద్యోగులు ఆయనను సత్కరించారు. ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయడానికి జోషి చేసిన కృషిని సీఎం కేసీఆర్ గుర్తించారని అందుకే సీఎస్ గా ప్రమోట్ చేశారన్నారు మంత్రి హరీష్. జోషీని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా… బ్యూరో క్రాట్ గా ఎప్పుడూ చూడలేదని… తెలంగాణ పౌరునిగా ఆయన పనిచేయడం గమనించామన్నారు మంత్రి.

ఇక తన పదవీకాలంలో హరీష్ లాంటి మంత్రిని చూడలేదని.. ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసేందుకు ఆయన పడుతున్న తపన అద్భుతమన్నారు జోషి. తనను సత్కరించిన అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates