ఇరుకున పెట్టేస్తాం : సరికొత్త ఐడియాతో కాంగ్రెస్

విభజన హామీలపై తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త ఐడియాతో ముందుకెళ్తోంది. విభజన సమయంలో కాంగ్రెస్ ఎంపీల పాత్ర చాలానే. నాటి పాత్రను గుర్తుచేస్తూ… విభజన హామీలపై పోరాడాలని నిర్ణయించారు. పార్లమెంట్ ముందు… మాజీ ఎంపీల ఆందోళన చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్.
విభజన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ మాజీ ఎంపీలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్, , సురేష్ షెట్కార్ తో సహా మాజీలంతా…దేశంలోని మిగతా రాజకీయ పార్టీల మద్దతుతో…విభజన హామీల కోసం పోరుకు రెడీ అవుతున్నారు.

అగస్ట్ మొదటివారంలో ఆందోళన చేసేందుకు కాంగ్రెస్ మాజీ ఎంపీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, హైకోర్ట్ విభజన, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాంటి అంశాలను హైలైట్ చేయాలన్నది ప్లాన్. దానికోసం మిగతా విపక్ష సభ్యులను కలిసి మద్ధతు కోరాలనుకుంటున్నారు. విభజన హామీలపై ఆందోళనతో పాటు టీఆర్ఎస్ పార్టీ…అధికార బీజేపీ పక్షమా… ? లేక ప్రతిపక్షమా తేల్చాలని భావిస్తున్నారట. ఈ వ్యూహంతో టి.ఆర్.ఎస్ ను ఇరుకున పెట్టాలని మాజీ ఎంపీలు ప్రణాళికలను రచిస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్లతో గాంధీ భవన్ లో సమావేశమయ్యారు.

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఆందోళన చేయాలని కాంగ్రెస్ ఎంపీలు భావిస్తున్నారు. వీలైతే పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేసి…అందరిదృష్టిని ఆకర్షించాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకే దెబ్బతో బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలను ఇరుకునపెట్టొచ్చని భావిస్తున్నారు మాజీ ఎంపీలు. కాంగ్రెస్ మాజీ ఎంపీలు ఆలస్యంగానైనా సరైన నిర్ణయం తీసుకున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది.

Posted in Uncategorized

Latest Updates