ఇర్ఫాన్ ఖాన్ మృతి షాక్‌కి గురి చేసింది: కే‌జ్రీవాల్

బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతితో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఇర్ఫాన్ మృతిపై స్పందించారు. ఇర్ఫాన్ ఖాన్ మృతి త‌న‌ను షాక్‌కి గురి చేసిందన్నారు. మా కాలంలోని అసాధార‌ణ‌మైన న‌టుల‌లో ఆయ‌న ఒక‌రు. ఇర్ఫాన్ న‌ట‌న ఎప్ప‌టికీ గుర్తుంటుంది. అత‌ని ఆత్మకి శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తున్నాను అంటూ ట్విట్ట‌ర్ ద్వారా సంతాపం తెలిపారు కేజ్రీవాల్.

Delhi CM

Latest Updates