ఇలాంటి టైంలో IPL మ్యాచ్ లా : మౌనదీక్షలో తమిళ నటులు

rajaniకావేరీ రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలంటూ తమిళనాడులో ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. తమిళ చిత్ర పరిశ్రమ కూడా నిరసన కార్యక్రమం చేపట్టింది. చెన్నైలో  మౌన దీక్ష చేపట్టారు నటులు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నటులు రజినీకాంత్, కమల్ హాసన్ విశాల్, కార్తీక్, విజయ్, నాజర్, శివకార్తికేయన్ తో పాటు మరికొందరు నటులు దీక్షలో పాల్గొన్నారు. అటు రాష్ట్రంలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి.

సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్. కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, తక్షణమే బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజల మనోభావాలు, బాధలను అర్థం చేసుకోవాలన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ సభ్యులు కనీసం నల్ల బ్యాడ్జీలను ధరించాలన్నారు. ఐపీఎల్ కు ఇది సరైన సమయం కాదన్నారు రజినీ కాంత్.

Posted in Uncategorized

Latest Updates