ఇలా చేసుకోవాలి : ఫేస్ బుక్ ద్వారా మొబైల్ రీఛార్జ్

facebook-rechargeకొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్. యూజర్లు క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా ఫేస్ బుక్ అకౌంట్ నుంచే మొబైల్ రీఛార్జ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. నెట్‌బ్యాంకింగ్‌, UPI, ఇతర పేమెంట్‌ మార్గాలతో రీఛార్జ్  చేసుకోవడానికి వీలులేదు. కేవలం డెబిట్, క్రెడిట్ కార్డ్ ద్వారానే ఇది సాధ్యం అవుతుంది. అన్ని ఫోన్లలో కాకుండా.. ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 167.0.0.42.94పై ఈ ఫీచర్ స్పాట్‌ అయింది. ప్రస్తుతం ప్రీపెయిడ్‌ నెంబర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. యాపిల్ ఐఫోన్లలో మాత్రం ఇంకా ఈ ఫీచర్‌ అందుబాటులోకి రాలేదు.

రీఛార్జ్ చేసుకునే విధానం :

యూజర్లు తమ మొబైల్ లోని ఫేస్ బుక్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలి. టాప్‌లో కుడివైపు ‘మొబైల్‌ రీఛార్జ్‌’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ కనిపించకపోతే, ‘సీ మోర్‌’లో ఈ ఫీచర్‌ ఉంటుంది. ఈ ఆప్షన్లను ట్యాప్‌ చేసిన తర్వాత వెల్‌కమ్‌ స్క్రీన్‌ కనిపిస్తుంది. మీ రీఛార్జ్ ఫ్లాన్ సెలక్ట్ చేసుకోవాలి. యాప్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకోవడానికి OTP పాస్‌వర్డ్‌ ను అడుగుతోంది. ఇలా యూజర్లు ఫేస్‌బుక్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకోవచ్చు.

Posted in Uncategorized

Latest Updates