ఇలా చేస్తే దంతాలు మెరుస్తాయి

 పెదాలు అందంగా కనిపించాలని చాలామంది కోరుకుంటారు. దాంతోపాటు దంతాలు మిలమిల మెరవాలని అనుకుంటారు. దంతాలు మెరవాలంటే బేకింగ్‌ సోడా బాగా పని చేస్తుంది. నిద్రపోయేముందు టూత్‌ పేస్ట్‌ పై బేకింగ్‌ సోడా కొద్దిగా చల్లు కొని పళ్లు తోముకోవాలి. సోడా కొద్దిగా వేసుకోవాలి. లేదంటే దంతాల పైన ఉండే ఎనామిల్‌ తొలగిపోయే ప్రమాదం ఉంది. ఇలా చేయడం వల్ల పళ్ల మీద మరకలు తొలుగుతాయి. చిగుళ్ల మీద చేరుకున్న బ్యాక్టీరియాను పోగొడుతుంది బేకింగ్‌ సోడా. స్ట్రా బెర్రీస్‌‌ కూడా దంతాలకు మెరుపునిస్తాయి. బాగా నమిలి తిన్నా దంతాలు శుభ్రపడతాయి. చాలామంది కాఫీలు, టీలు ఎక్కువగా కూడా తాగుతుంటారు. రోజుకు రెండుసార్లు కన్నా ఎక్కువ తాగకూడదు. లేకుంటే.. దంతాల మీద మరకలు పేరుకుపోయి పసుపు రంగులోకి మారతాయి. కూల్‌ డ్రింక్స్‌ కు కూడా దూరంగా ఉండటం మంచిది.

Posted in Uncategorized

Latest Updates